దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఖమ్మం జిల్లా వైరా, ఏన్కూరులో వివిధ సంఘాల మహిళలు ఆందోళనలు, ప్రదర్శనలు చేశారు. ఇవాళ జరిగిన సమ్మెలో మహిళలందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్మిక చట్టాలు పరిరక్షించాలని, కనీస వేతనం, ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. బంద్‌లో ఆశాకార్యకర్తలు, అంగన్‌వాడీ కార్మికులు, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పోలీస్ స్టేషన్లో గాజుముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం