ETV Bharat / state

మేమున్నాం.. మీకు అండగా! - ఈనాడు ఆధ్వర్యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నంబర్​ ఏర్పాటు

కరోనా ప్రభావం.. లాక్‌డౌన్‌ ఆంక్షలతో ప్రస్తుతం ఇళ్ల నుంచి కదల్లేని పరిస్థితి. ఈ తరుణంలో సరకులు స్థానికంగా లభ్యంకాకపోయినా, అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నా.. ‘ఈనాడు’ మీకు అండగా నిలవనుంది. మీ సమస్యను మాకు తెలియజేస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించే ప్రయత్నం చేస్తాం.

eenadu
మేమున్నాం.. మీకు అండగా!
author img

By

Published : Apr 13, 2020, 12:41 PM IST

● పాలు, వైద్య సాయం, కూరగాయలు, ఔషధాలు, తాగు నీరు ఇలా నిత్యావసరాలు ఏవైనా మీ ప్రాంతంలో అందుబాటులో లేకపోయినా, గంటల తరబడి విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఎదురవుతున్నా ఈనాడు దృష్టికి తీసుకురండి... మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

● మీరు చేయాల్సిందల్లా సమస్య, ప్రాంత వివరాలు ఈ ఫోన్‌ నంబరుకు తెలియజేయడమే.

ప్రశ్న: ఇచ్చోడ మండలం దుబార్‌పేటలో విద్యుత్తు సమస్య ఉంది. వారం రోజుల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి కోతలు విధిస్తున్నారు.

- ఉమామహేశ్వరి, దుబార్‌పేట

జవాబు: గ్రామంలో బిల్లులు సక్రమంగా చెల్లించని కారణంగా సరఫరా నిలిపివేశాం. సింగిల్‌ ఫేస్‌ విద్యుత్తు ఉంది. బిల్లులు చెల్లించి సర్వీసు మీటర్లు తీసుకుంటే విద్యుత్తు అందించేలా చూస్తాం.

- రవికుమార్‌, ఏఈ

ప్రశ్న: తలమడుగు మండల కేంద్రంలో నేటికి శనగ కొనుగోళ్లు ప్రారంభం కావడం లేదు. ఒక్క రైతుకు 6 క్వింటాళ్లకే టోకెన్లు ఇస్తున్నారు.

- ప్రశాంత్‌రావు, తలమడుగు

జవాబు: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక్కో రైతుకు 6 క్వింటాళ్ల టోకెన్లు ఇస్తున్నాం. రైతుల ఇబ్బందులను మార్క్‌ఫెడ్‌ డీఎం పుల్లయ్య దృష్టికి తీసుకెళ్లాం.

- సరిత, విస్తరణ అధికారి, తలమడుగు

*గ్రీడ్‌ నుంచి తాగునీరు రాకపోవడంతోనే రెండ్రోజుల నుంచి అంతరాయం ఏర్పడుతుంది. ప్రస్తుతం ట్యాంకుల్లో నింపుతున్నాం. సోమవారం ఉదయం సరఫరా చేస్తాం.

- లక్ష్మీ, ఏఈ

ఇదీ చూడండి : రూ. 1500కే కరోనా పరీక్ష.. రెండున్నర గంటల్లో ఫలితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.