Untimely Rains Damage Cotton Crop In Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లా పత్తి రైతులకు ఈ సంవత్సరం నష్టాల మూటలే దిగుబడులుగా మిగులుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఖమ్మం జిల్లాలో లక్షా 79వేల 287 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్షా 99వేల 720 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. సీజన్ ఆరంభం నుంచి అన్నదాతకు కాలం పరీక్ష పెడుతూనే ఉంది. జూన్, జులై మాసాల్లో వర్షాలు రైతులతో దాగుడు మూతలాడటంతో రైతులు, ఒకటికి రెండు మూడు సార్లు విత్తనాలు నాటుకోవాల్సి వచ్చింది.
సీసీఐ రంగంలోకి దిగిన సరే.. పత్తి రైతుకు దక్కని మద్దతు ధర..
వర్షాలతో పంట నష్టం : ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు లేకపోవటంతో పంట ఎదుగుదల లోపించింది. దీనికి తోడు తెగుళ్లు సోకి పంట ఎండిపోవటంతో కర్షకులకు కష్టాలు తప్పలేదు. ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకపోవటంతో రైతులు అదనపు పెట్టుబడులు పెట్టారు. వ్యయ ప్రయాసల కొర్చి చేతికందిన నాలుగు దూది పూలు ఏరుకుందామనేలోపే అన్నదాతలపై తుపాను ఊహించని పిడుగులా పడింది. వర్షపు నీటిలో తడిసిన పత్తి రంగు మారి రైతుకు గుండె కోత మిగిల్చింది.
"పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగాయి. క్వింటాల్‌కు రూ.10,000 వస్తే మాకు గిట్టుబాటు అవుతుంది. కూలీలకు ఇచ్చే దినసరి కూలీ, రవాణా ఖర్చులు పెరిగాయి. గత ఏడాది రూ.8000 ఉన్న ధర ప్రస్తుతం వ్యాపారులు తక్కువగా చెబుతున్నారు. వర్షాల కారణంగా సగం పత్తి పంట మట్టిపాలైంది. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి." - పత్తి రైతులు
cotton prices: పతనమవుతున్న పత్తి ధర.. దిక్కుతోచని స్థితిలో రైతన్న
Provide Minimum Support Price For Cotton : నానా కష్టాలు పడి పంటను కాపాడే ప్రయత్నం చేసినా సగానికి సగం తగ్గిపోయిన దిగుబడులతో హలధారి కుంగిపోతున్నాడు. సాధారణంగా సీజన్ అనుకూలిస్తే ఎర్రనేలల్లో 10 నుంచి 12 క్వింటాళ్లు, నల్లరేగడి భూముల్లో 15-20 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చేది. కానీ ఎర్రనేలల్లో 5 క్వింటాళ్లు, నల్లరేగడి భూముల్లో 7 క్వింటాళ్లకు మించి పంట చేతికి రాలేదు. ఎకరాకు కనీసం 3 క్వింటాళ్లు దిగుబడి రావటమే గగనంగా మారిందని చాలా మంది రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాతాళానికి పడిపోయిన ధరలతో చేతికొచ్చిన కొద్దిపాటి పత్తిని ఎక్కడ అమ్మాలో అన్నదాతలకు దిక్కుతోచట్లేదు.
ఈ ఏడాది తగ్గిన మద్దతు ధర : గతేడాది రూ.10 నుంచి రూ.12 వేల వరకు పలికిన ధర ఈసారి రూ.6 వేల 500 దాటట్లేదు. దీనికితోడు పత్తి రంగు మారిందని, నాణ్యత లేదంటూ వ్యాపారులు మరింత కొర్రీలు పెడుతున్నారని అన్నదాతలు లబోదిబోమంటున్నారు. పెరిగిన కూలీల రేట్లు, రవాణా ఖర్చులతో నష్టాలు మూటగట్టుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కొనుగోళ్లు చేస్తామన్న సీసీఐ అలంకారప్రాయంగానే మారింది. పంట కొనుగోళ్లకు సవాలక్ష కొర్రీలు విధించటంతో కర్షకులు సీసీఐ వైపు కన్నెత్తి చూడట్లేదు.
మార్కెట్‌కి పత్తి రాక.. గతేడాది కంటే సగానికి తగ్గిన ధర
Cotton support price: పత్తి ధర బాగున్నా రైతుకు సున్నా.. దిగుబడి లేక ఆవేదన..