ETV Bharat / state

తెరాసలో వర్గపోరు.. ఎమ్మెల్యేపై కార్యకర్తల ఫైర్ - పాలేరు వార్తలు

పాలేరు తెరాసలో వర్గపోరు బట్టబయలయింది. గురువారం కూసుమంచిలో సమావేశమైన ఎమ్మెల్యే కందాల వ్యతిరేక వర్గం తీవ్ర ఆరోపణలు చేసింది.

two groups at paleru constancy in khammam district
పాలేరు తెరాసలో బయటపడిన వర్గపోరు
author img

By

Published : Dec 24, 2020, 7:02 PM IST

ఖమ్మం జిల్లా పాలేరు తెరాసలో వర్గపోరు తీవ్రమైంది. నియోజకవర్గంలోని 4 మండలాల రైతుబంధు సమితి అధ్యక్షులను తొలిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కొత్తగా మళ్లీ 4 మండలాల కమిటీలను ప్రకటించారు. కొత్త కమిటీల్లో ఎమ్మెల్యే కందాల వర్గీయులకు పదవులు ఇచ్చారంటూ మరో వర్గం వారు ఆరోపిస్తున్నారు. గురువారం కూసుమంచిలో సమావేశమైన ఎమ్మెల్యే కందాల వ్యతిరేక వర్గం వారు ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు.

పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని.. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కై తెరాస ఓటమికి ఎమ్మెల్యే కారణమయ్యారని అన్నారు. ఎమ్మెల్యే తీరుపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని తెరాస నేత నరేశ్​ రెడ్డి చెప్పారు. కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్​లో గెలిచి తెరాసలోకి వచ్చి పార్టీలో ఉన్న నాయకులు, ఉద్యమకారులను పక్కకు పెట్టి తమ అనుచరులకు పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. రైతు సమితి బంధు అధ్యక్షులను తొలగించడం సరైన పద్ధతి కాదన్నారు.

ఇదీ చదవండి: క్రిస్మస్​ వేడుకలకు ముస్తాబైన మెదక్​ కేథడ్రాల్​ చర్చ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.