ETV Bharat / state

తాత్కాలిక డ్రైవర్​ తప్పిదం... గాయపడిన మహిళా కండక్టర్​

ఖమ్మం డిపో వద్ద మహిళా కండక్టర్లు దీక్ష కొనసాగిస్తుండగా... ఓ తాత్కాలిక డ్రైవర్​ తప్పిదం వల్ల బస్సు టెంటును ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళా కండక్టర్​కు గాయాలయ్యాయి.

తాత్కాలిక డ్రైవర్​ తప్పిదం... గాయపడిన మహిళా కండక్టర్​
author img

By

Published : Oct 24, 2019, 7:10 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. రాష్ట్ర ఐకాస పిలుపు మేరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఆరు డిపోలు, బస్టాండ్​ల ఎదుట మహిళా కండక్టర్​లు దీక్షలు చేపట్టారు. ఖమ్మం బస్​ డిపో ఎదుట ఉదయం నుంచే మహిళా కండక్టర్లు దీక్షలో పాల్గొన్నారు. వీరికి పలు మహిళా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. వారు దీక్షలో కూర్చుండగా... బస్టాండ్​ నుంచి వెళ్తున్న ఓ బస్సు తాత్కాలిక డ్రైవర్​ తప్పిదంతో టెంటు కర్రను ఢీకొట్టింది. దీనితో ఆ టెంటు కూలిపోయి.. ఓ మహిళా కండక్టర్​ మీద పడింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. మహిళా కండక్టర్లు డిపో ఎదుట భైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని గాయపడ్డ మహిళా కండక్టర్​ను ఆసుపత్రికి తరలించారు.

తాత్కాలిక డ్రైవర్​ తప్పిదం... గాయపడిన మహిళా కండక్టర్​

ఇదీ చూడండి: హరియాణా 'కింగ్​మేకర్'​ దుష్యంత్ ఎవరో తెలుసా?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.