రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 45వ రోజుకు చేరుకుంది. ఖమ్మం ఆర్టీసీ డిపో ఎదుట తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అఖిలపక్షం నేతలు వారికి సంఘీభావం ప్రకటించి డిపో ఎదుట బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా గంటపాటు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మిక సంఘం నేతలను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు