ఖమ్మం జిల్లా వైరాలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం అర్థరాత్రి ఆంధ్రా బ్యాంక్ వెనుక భాగంలో కిటికి చువ్వలు తొలగించి లోనికెళ్లారు. అంతలోనే బ్యాంకులో సైరన్ మోగడం వల్ల పరారయ్యారని బ్యాంకు సిబ్బంది పేర్కొన్నారు. పది రోజుల క్రితం ఎస్బీఐలో చోరీకి ప్రయత్నం చేయగా, తాజాగా ఆంధ్ర బ్యాంకులో మరోసారి ప్రయత్నించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలించి చర్యలు ప్రారంభించారు. ఏసీపీ ప్రసన్న కుమార్, సీఐ వసంత్ కుమార్లతో పాటు ప్రత్యేక స్క్వాడ్ బృందం దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : ఉద్యోగాలిప్పిస్తామంటూ... నిరుద్యోగులకు ఎర