ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో తెరాస విజయఢంకా మోగించింది. రెండు జడ్పీ పీఠాలపై గులాబీ జెండా ఎగిరింది. ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్గా లింగాల కమల్ రాజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్గా కోరం కనకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా పరిషత్లో మొత్తం 20 జడ్పీటీసీలకు గానూ 17 స్థానాలు గెలుచుకున్న తెరాస... జడ్పీ పీఠాన్ని ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఖమ్మం జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్గా తెరాస జడ్పీటీసీ సభ్యురాలు మరికంటి ధనలక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 21 జడ్పీటీసీ స్థానాలకు గానూ 20 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 16 స్థానాల్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్గా కోరం కనకయ్య, వైస్ ఛైర్మన్గా కంచర్ల చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు జిల్లాల్లోనూ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు.
ఇవీ చూడండి: 32 జడ్పీ స్థానాల్లో జెండా ఎగురవేసిన తెరాస