ETV Bharat / state

TRS Leaders on Tummala: 'తుమ్మల నాగేశ్వరరావు పార్టీకి అనేక సార్లు ద్రోహం చేశారు'

author img

By

Published : Mar 17, 2022, 5:15 PM IST

TRS Leaders on Tummala: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీకి అనేక సార్లు ద్రోహం చేశారని.. ఆయనకు మాట్లాడే విధానమే తెలియదని ఎమ్మెల్యే కందాల ఉపేందర్​ రెడ్డి వర్గీయులు ఆరోపించారు. తుమ్మల ఓడిపోవడానికి కారణం ఆయన స్వయంకృతాపరాధమేనన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన చేసిన పనులు ఏమీ లేవన్నారు.

TRS Leaders on Tummala: 'తుమ్మల నాగేశ్వరరావు పార్టీకి అనేక సార్లు ద్రోహం చేశారు'
TRS Leaders on Tummala: 'తుమ్మల నాగేశ్వరరావు పార్టీకి అనేక సార్లు ద్రోహం చేశారు'

TRS Leaders on Tummala: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​ రెడ్డి వర్గీయులు తీవ్ర విమర్శలు గుప్పించారు. తుమ్మల ఓడిపోవడానికి కారణం ఆయన స్వయంకృతాపరాధమేనని ఆరోపణలు చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పర్యటనలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ శత్రువులను నమ్మొచ్చు కానీ రాజకీయ ద్రోహులను నమ్మకూడదంటూ మాట్లాడారు. ఆ వ్యాఖ్యలనుద్దేశించి ఉపేందర్​ రెడ్డి వర్గీయులు తుమ్మలపై విమర్శలు చేశారు.

తుమ్మల నాగేశ్వరరావు పార్టీకి అనేక సార్లు ద్రోహం చేశారని.. ఆయనకు మాట్లాడే విధానమే తెలియదని ఆరోపించారు. కేసీఆర్​, కేటీఆర్​ ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి చేశాడని.. ఆయన సొంతంగా రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. పలు కాంట్రాక్టులను తన అనుచరులకే ఇచ్చేవాడని.. ఇతరులెవరికి ఒక్క కాంట్రాక్టు కూడా ఇచ్చేవాడు కాదని విమర్శించారు. కార్యకర్తలు చనిపోయినా మందలించే వాడు కాదని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోయి నమ్మక ద్రోహం చేశారని అనడం పద్ధతి కాదన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన చేసిన పనులు ఏమీ లేవన్నారు. ఆయన తప్ప జిల్లాలో మరో వ్యక్తిని రాజకీయంగా ఎదగనివ్వడం లేదని వారు మండిపడ్డారు.

పాలేరు నియోజకవర్గంలో రెండో వర్గంగా చీలిపోయి పార్టీకి తీరని నష్టం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సొంత గ్రామంలోనే తెరాసకు 350 ఓట్లు తక్కువ వచ్చాయన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ఎవరికీ సహాయం చేయకపోగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపించారు. ఇప్పటికైనా తుమ్మల అలా మాట్లాడడం మార్చుకోవాలని వారు తెలిపారు. ఆయన పక్కన తిరిగే నాయకులే ఆయనను మోసం చేశారని.. అది తెలుసుకోవాలన్నారు. కొందరు ద్రోహం చేశారనడం సరైంది కాదన్నారు. ఆయన తీరును మార్చుకుని టికెట్​ తీసుకుని వస్తే మరలా పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

సంబంధిత కథనం:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.