ETV Bharat / state

మార్కెటింగ్‌ శాఖలో ‘కుర్చీ’లాట - lack of clarity in khammam transport department

ఖమ్మం మార్కెటింగ్‌శాఖలో కొద్ది రోజులుగా ‘కుర్చీ’లాట జరుగుతోంది. జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారుల బదిలీల విషయమై అయోమయం నెలకొని ఆ ప్రభావం మూడు జిల్లాలపై పడుతోంది. బదిలీలపై రోజుకో ఉత్తర్వు వస్తోంది.

transfers in khammam marketing department
ఖమ్మంలోని మార్కెటింగ్‌ శాఖ కార్యాలయం
author img

By

Published : Apr 28, 2020, 2:01 PM IST

ఖమ్మం డీఎంవోగా నాగరాజు

ఖమ్మం జిల్లా మార్కెటింగ్​ శాఖ అధికారుల బదిలీపై రోజుకో ఉతర్వు వస్తోంది. సోమవారం మార్కెటింగ్‌శాఖ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులతో బదిలీల వ్యవహారం అస్పష్టతకు దారితీస్తోంది. ఖమ్మం జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి ఆర్‌.సంతోష్‌కుమార్‌ పనితీరు సరిగా లేకపోవటం వల్ల కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించారు. ఈనెల 17న ఆయన ఆ బాధ్యతల్లోంచి వైదొలిగారు.

ఈ స్థానంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు ఈనెల 18న తాత్కాలిక బాధ్యతలప్పగించారు. అనంతరం ఈనెల 23న కొత్తగూడెం డీఎంవో జాలా నరేందర్‌ను ఖమ్మానికి, ఇక్కడ పనిచేసిన ఆర్‌.సంతోష్‌కుమార్‌ను కొత్తగూడెంలో అదే స్థానానికి బదిలీ చేస్తూ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ మళ్లీ ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు అధికారులిద్దరూ బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇక్కడ ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది!

ఖమ్మంలోని మార్కెటింగ్‌ శాఖ కార్యాలయం

జిల్లాలో సంతోష్‌కుమార్‌ నియామకంపై కొత్తగూడెం కలెక్టర్‌ ఎంవీరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నరేందర్‌నే తమ వద్ద కొనసాగించాలని మార్కెటింగ్‌ శాఖ రాష్ట్ర అధికారుకు లేఖ రాశారు. సిద్దిపేట డీఎంవోగా పనిచేస్తున్న నాగరాజును ఖమ్మం జిల్లాకు, సంతోష్‌కుమార్‌ను సిద్దిపేట జిల్లాకు, నరేందర్‌ను తిరిగి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేస్తూ సోమవారం ఆ శాఖ రాష్ట్ర సంచాలకులు లక్ష్మీబాయి ఉత్తర్వులు జారీచేశారు. సంతోష్‌కుమార్‌, నాగరాజు ఇద్దరూ నేడు తమ జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.