Thummala Joins Congress Today : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్దందుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ పయనంపై ఉత్కంఠ వీడింది. బీఆర్ఎస్ నుంచి పాలేరు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన.. కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరనుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ ముఖచిత్రం మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Tummala Nageswara Rao Joins Congress Today : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) 40 ఏళ్ల రాజకీయ జీవితం మరో మలుపు తిరుగుతోంది. నాలుగు దశాబ్దాలుగా ఖమ్మం జిల్లా రాజకీయాలపై తనదైన ముద్రవేసి, అభివృద్ధి మాంత్రికుడిగా పేరొందిన తుమ్మల.. తదుపరి పయనం కాంగ్రెస్‌తో సాగనుంది. రాబోయే ఎన్నికల్లో పాలేరు బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపాటుకు గురయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే బీఆర్ఎస్ అధినేత మొగ్గుచూపడంతో తుమ్మల తీవ్ర నిరాశకు గురయ్యారు. అభ్యర్థుల జాబితాలో చోటు దక్కకపోవడంపై తుమ్మల వర్గీయులు రగిలిపోయారు.
Ponguleti Meets Tummala : తుమ్మలతో పొంగులేటి భేటీ.. మాజీ మంత్రి నిర్ణయంపై అనుచరుల్లో ఉత్కంఠ
Tummala Congress Joining Today : ఈ క్రమంలోనే తుమ్మలను కాంగ్రెస్‌లోకి రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ఆహ్వానించారు. చాలా రోజులపాటు అనుచరవర్గంతో చర్చలు జరిపిన తుమ్మల.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్‌రావు ఠాక్రే సహా ముఖ్య నేతలంతా హైదరాబాద్‌లోని తుమ్మల నివాసంలో సమావేశమై.. సీడబ్ల్యూసీ సమావేశాల్లోనే పార్టీలో చేరాలని ఆహ్వానం పలికారు.
Khammam Politics Latest News 2023 : తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడం.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ ముఖ చిత్రంపై స్పష్టమైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఉభయ జిల్లా రాజకీయాలపై తుమ్మలకు ప్రత్యేక ముద్ర ఉంది. జిల్లా అభివృద్ధిపైనా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ భారీగా అనుచరగణం ఉంది. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరడం, తాజాగా తుమ్మల చేరుతుండటం గులాబీ దళానికి ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు.
జిల్లా నుంచి కొందరు ముఖ్య నేతలు, అనుచరులు, కార్యకర్తలను కాంగ్రెస్‌లో చేర్చేందుకు ముమ్మర ప్రయత్నాలు తుమ్మల వర్గీయులు చేస్తున్నారు. ఆదివారం తుక్కుగూడలో నిర్వహించనున్న కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే మండలాల వారీగా తుమ్మల ప్రధాన అనుచరులకు సమాచారం చేరవేశారు.
తాజాగా బీఆర్ఎస్కు తుమ్మల రాజీనామా చేశారు. తనకు పార్టీలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించారు. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరుతుండటంతో.. ఉమ్మజి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలు అప్రమత్తమవుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు పార్టీని వీడకుండా బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. బీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాలతో ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే తిష్ట వేసి రాజకీయ పరిస్థితుల్ని గమనిస్తున్నారు.
Thummala Comments on Assembly Elections 2023 : నా ప్రజల కోసం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా: తుమ్మల