Thummala BRS MLA Ticket Issue : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితాను ఈనెల 21న సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన వేళ కొందరు నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు అసంతృప్తితో ఉన్నారు. అయితే అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడింది బీఆర్ఎస్.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు.. తుమ్మలతో భేటీ అయ్యారు. పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao)కు.. బీఆర్ఎస్ మొండిచెయి చూపింది. దీంతో తుమ్మల, ఆయన అనుచరవర్గంలో అసమ్మతి గళం మొదలైంది.
Paleru BRS MLA Ticket 2023 : పాలేరు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఆయన అభిమానులు, అనుచురులు మద్దతుగా నిలుస్తున్నారు. ఖమ్మంలో ఇటీవల పాలేరు నియోజకవర్గాని(Paleru MLA Ticket 2023)కి చెందిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. అనంతరం వైరా, మధిర, సత్తుపల్లి, ఇల్లందు నియోజకవర్గాల్లోనూ తుమ్మల వర్గం అంతర్గత సమావేశాలతో అనుచరగణం భారీగా హాజరైంది. అపార రాజకీయ అనుభవం గల నేతగా.. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన తుమ్మలకు బీఆర్ఎస్ అధిష్ఠానం మొండిచెయ్యి చూపిందని వాపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాలేరు బరిలో తుమ్మల నిలవాల్సిందేనని నిర్ణయించారు. తుమ్మల ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా తామంతా ఆయన వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి తుమ్మల పోటీచేయాలని పలువురు నాయకులు బాహాటంగానే ప్రకటించడం గమనార్హం.
MP Nama Nageswara Rao meet Tummala : అసంతృప్తులకు బుజ్జగింపులు.. తుమ్మలతో నామ భేటీ
BRS MLA Tickets Telangana 2023 : అభ్యర్థుల జాబితాలో పాలేరు నుంచి కందాళ ఉపేందర్‌రెడ్డికి మరోసారి బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. తుమ్మల స్పందించకపోయినా.. ఆయన అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. కొంత రాజకీయంగా స్తబ్ధుగా ఉన్నారు. ఎక్కడా పార్టీపరంగా రాజకీయ కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ జనవరిలో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలోనూ.. ఎక్కడా పార్టీ, అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. సీఎం కేసీఆర్ పిలుపుతో.. ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావసభ నిర్వహణలోనూ కీలకపాత్ర పోషించారు. పాలేరు నుంచి తప్పకుండా బరిలో ఉంటానని కార్యకర్తలతో చెబుతూ వచ్చారు. మన ఖమ్మం- మన తుమ్మల- మన భవిష్యత్ నినాదంతో అనుచరులు కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ముఖ్యనేతలతో బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన బీఆర్ఎస్ : తుమ్మల నాగేశ్వరావును బుజ్జగించేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం.. ముఖ్య నేతలను రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ హైదరాబాద్‌లో తుమ్మలను కలిశారు. బుధవారం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రత్యేకంగా భేటీ అయి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన అంశాలను వివరించినట్లు తెలిసింది. తాజా పరిణామాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారుతోంది.
BRS MLA Tickets Telangana 2023 : సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట.. ఏడుగురు మహిళలకు ఛాన్స్