ETV Bharat / state

25న కొత్త సినిమాతో థియేటర్లు పునఃప్రారంభం - telangana varthalu

ఎన్నాళ్లో వేచిన ఉదయం.. మరొక్క రోజులో వెండితెరపై సాక్షాత్కరించనుంది. పది నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణకు ‘తెర’పడనుంది. ఎన్ని వేదికలున్నా ఆ వినోదమే వేరు మరి! శుక్రవారం నుంచి థియేటర్లు తెరచుకోనున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ చలనచిత్రాల ప్రదర్శనకు యాజమాన్యాలు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తసినిమా విడుదలతో సినీసంరంభం పునఃప్రారంభం కానుంది. దీంతో సర్వత్రా ఒకింత ఉత్కంఠ నెలకొంది.

Theaters reopen with a new movie on the 25th in joint khammam district
25న కొత్త సినిమాతో థియేటర్లు పునఃప్రారంభం
author img

By

Published : Dec 24, 2020, 3:04 PM IST

ఈనెల 25న కొత్త సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత సినిమాల విడుదల కొనసాగే అవకాశం ఉన్నందున వచ్చే ఏడాది జనవరి నాటికి ఒక్కొక్కటిగా థియేటర్లు తెరుచుకోనున్నాయి. క్రిస్మస్‌, కొత్త సంవత్సరంతో పాటు సంక్రాంతికి ఎక్కువగా సినిమాలు విడుదల అయ్యేందుకు వీలుంది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఇప్పటివరకు చరవాణిలు, టీవీలతో కాలక్షేపం, వినోదం పొందిన ప్రజలు ఆశించిన మజాను పొందలేకపోయారు. ఓటీటీల్లో పెద్దా, చిన్న నూతన సినిమాలు విడుదలైనప్పటికీ థియేటర్లలో వచ్చే వినోదాన్ని ఆస్వాదించేందుకు సిద్ధం అవుతున్నారు. నూతన సినిమాలతో పాటు ఇప్పటికే పలు వేదికల్లో విడుదలైన వాటిని కూడా థియేటర్లలో ప్రదర్శించేందుకు అవకాశం ఉంది.

రాయితీలతో ఉపశమనం

లాక్‌డౌన్‌తో మూతబడిన థియేటర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. ప్రతి నెలా వచ్చే విద్యుత్తు బిల్లులో రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు డిమాండ్‌కు తగినట్లు ప్రదర్శనలు, టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో నిర్వహణ ఖర్చులో కొంత వెసులుబాటు కలగనుంది. లాక్‌డౌన్‌ నుంచి నెలకు రూ.5 లక్షల చొప్పున నష్టపోయామని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల కొత్త సినిమాల విడుదల కొనసాగనున్న నేపథ్యంలో ఆర్థిక భారం తగ్గనుందని థియేటర్ల యజమానులు చెబుతున్నారు.

కొవిడ్‌ నిబంధనలు

సినిమా ప్రదర్శన ముగిసిన అనంతరం థియేటర్‌ అంతటా శానిటైజేషన్‌ చేయడం, 50 శాతం ప్రేక్షకులను అనుమతించడం, థియేటర్‌ సిబ్బంది, విక్రయ కేంద్రాల్లో పని చేసేవారితో పాటు ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించాలనే నిబంధనలను ప్రభుత్వం విధించింది. వీటన్నింటినీ పాటిస్తూ చలన చిత్రాల ప్రదర్శనకు థియేటర్లను సిద్ధం చేసేందుకు నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు.

సినిమా థియేటర్లు

  • ఉమ్మడి జిల్లా: 42
  • కొత్తగూడెం, పాల్వంచ: 18
  • ఖమ్మం నగరం: 7

పది నెలల ‘ముగింపు’ కథ

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 19 నుంచి థియేటర్లలో చలన చిత్రాల ప్రదర్శనలు నిలిపివేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో సినీ ప్రేక్షకులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. లాక్‌డౌన్‌ అనంతర పరిణామాల నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు ప్రారంభమైనప్పటికీ థియేటర్లు మాత్రం తెరుచుకోలేకపోయాయి. పది నెలల నిరీక్షణ తర్వాత నవంబరు 23న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చలన చిత్రాలను థియేటర్లలో ప్రదర్శించుకోవచ్చునని ప్రకటించారు. ఈ నిర్ణయంతో సినీ ప్రేక్షకుల్లో నూతన ఉత్సాహం వెల్లువెత్తింది.

సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి

ఈనెల 25న సాయితేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘సోలో బ్రతుకే.. సో బెటర్‌’ సినిమాను మా థియేటర్‌లో ప్రదర్శిస్తున్నాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశార. గోడ పత్రికలు, ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తున్నాం. ప్రభుత్వం విధించిన కొవిడ్‌ నిబంధనలు పాటించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సినిమా వినోదాన్ని పొందేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. -శ్రీనివాస్‌రెడ్డి, తిరుమల థియేటర్‌ మేనేజర్‌

సాధారణ పరిస్థితులు వస్తాయి

రాష్ట్ర ప్రభుత్వం చలన చిత్రాల ప్రదర్శనకు అనుమతులు ఇవ్వడం, కొత్త సినిమాలు విడుదల చేయడం సంతృప్తికరంగా ఉంది. ఈనెల 25న సోలో బ్రతుకే.. సో బెటర్‌ సినిమా విడుదల కానుంది. థియేటర్లు తెరిచి చలన చిత్రాలు ప్రదర్శితమైతే యాజమాన్యాలకు కొంతమేర ఉపశమనం కలుగుతుంది. ప్రేక్షకులు సైతం సినిమాలు చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. -కాంపాటి పిచ్చయ్య, ఖమ్మం కేపీఎస్‌(ఆదిత్య) థియేటర్‌ యజమాని

థియేటర్లు తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నాం

థియేటర్లు అంతటా శానిటైజేషన్‌ చేయడం, సిబ్బంది సంఖ్య పెంచడం, పార్కింగ్‌ వంటి ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుంది. కొత్త సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటున్నాం. సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో తెరిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. పది నెలలుగా సిబ్బంది, కార్మికులు పని లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యాలు తిరిగి వారికి ఉపాధి కల్పించేందుకు చొరవ చూపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది. -రేఖల భాస్కర్‌, ఖమ్మం వినోద థియేటర్‌ యజమాని

ఇదీ చూడండి: రుణం ఆశ చూపారు.. లక్షలు దోచేశారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.