ETV Bharat / state

ఖమ్మం కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం - తెలంగాణ తాజా వార్తలు

కోర్టు ధిక్కరణకు పాల్పడిన వ్యవహారంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఖమ్మం కలెక్టర్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ అప్పీలుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగిల్‌ జడ్జి ముందస్తుగా ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఉత్తర్వులు వెలువరించారంటూ అప్పీలులో పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఖమ్మం కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం
ఖమ్మం కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం
author img

By

Published : Mar 3, 2021, 7:11 AM IST

కోర్టు ధిక్కరణకు పాల్పడిన వ్యవహారంలో రూ.500 జరిమానా విధిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ అప్పీలుపై మంగళవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగిల్‌ జడ్జి ముందస్తుగా ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఉత్తర్వులు వెలువరించారంటూ అప్పీలులో పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయమూర్తి వేరు, తీర్పు వేరని వాటి మధ్య తేడాను గుర్తించాలని స్పష్టం చేసింది. న్యాయమూర్తి ఉత్తర్వులపై కాకుండా ఆయనపై వ్యక్తిగత ఆరోపణలతో ఉద్దేశాలు ఆపాదిస్తారా? అని నిలదీసింది. కోర్టు ధిక్కరణ అప్పీలులో పేర్కొన్న ఈ కారణాన్నే కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించరాదో చెప్పాలంటూ ఖమ్మం కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ న్యాయవాదికీ నోటీసులు జారీ చేసింది. ఆరోపణలను తొలగిస్తూ బేషరతు క్షమాపణతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించడంతో హైకోర్టు అనుమతిస్తూ విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ వివాదం

ప్రభుత్వ పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సమర్పించిన వినతి పత్రాలపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఖమ్మం జిల్లా పెనుబల్లికి చెందిన కర్రి వెంకట్రామయ్య కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్‌ జడ్జి ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌కు రూ.500 జరిమానా విధిస్తూ ఈ మొత్తాన్ని జీతం నుంచి వసూలు చేయాలని ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ కలెక్టర్‌ దాఖలు చేసిన అప్పీలుపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. చివరి అవకాశంగా కోర్టుకు వస్తారని, కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయరని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశాక అమలు చేశారని పేర్కొంది. ఈ దశలో న్యాయవాది జోక్యం చేసుకుంటూ తెలియక పొరపాటు చేశారని, ఇది మొదటి తప్పని చెప్పగా 2012 బ్యాచ్‌కు చెందిన వ్యక్తి తెలియదంటే ఎలా అంటూ ధర్మాసనం నిలదీసింది. అఫిడవిట్‌లో కూడా ఎక్కడా పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడాన్ని ప్రశ్నించింది.

ఇదీ చూడండి: ఇద్దరు కలెక్టర్లకు 3 నెలలు జైలు విధించిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.