ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం మూలపోచారంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న తమపై అటవీశాఖ అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తన పత్తిపంటపై కలుపు మందు పిచికారీ చేసి ఎండిపోయేలా చేశారని సామ్య అనే రైతు ఆరోపించారు. చేతికొచ్చిన పంటను నాశనం చేశారంటూ ప్రజా సంఘాలతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పోడు సాగు దారులపై ప్రభుత్వం, అటవీశాఖ చేపడుతున్న చర్యలను ప్రజా సంఘాల నేతలు ఖండించారు.
ఇవీ చూడండి: రోడ్డుపై సినీ హీరో రౌడీయిజం- చితక్కొట్టిన జనం!