ప్రజల క్షేమం కోసం మోదీ, కేసీఆర్ సూచించిన సలహాలు పాటించాలని కోరుతూ ఓ చిన్నారి పాట రూపంలో అవగాహన కల్పిస్తోంది. హైదరాబాద్‌లో నాలుగో తరగతి చదువుతున్న వన్యమిత్ర కరోనాపై అవగాహన కల్పించేందుకు తనవంతుగా పాట రాసుకుని తానే ఆలపించింది.
పరిశుభ్రత, సామాజిక దూరం పాటించి కరోనా మహమ్మారిని పారదోలలని... తమలాంటి చిన్నారులకు బంగారు భవిత అందించాలని ఆకాంక్షిస్తూ పాటరూపంలో తన భావాలను వ్యక్తపరిచింది. ఆ చిన్నారి భావాలేమిటో మీరూ వినండి.
ఇదీ చూడండి: 'జమాత్' బాస్‌పై ఐటీ శాఖ గురి- త్వరలోనే ఉచ్చు!