ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని గాంధీజీ సంకల్ప యాత్రను మాజీ ఎమ్మెల్యే పద్మారావు ప్రారంభించారు. గాంధీ కలలు కన్నా స్వరాజ్యం రావాలని, స్వచ్ఛభారత్ కల నెరవేరాలని, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించండమే సంకల్పయాత్ర ముఖ్యఉద్దేశమని తెలిపారు. గాంధీ కుటుంబం అని చెప్పుకునే కొన్ని పార్టీలు గాంధీని విస్మరించారని ఆరోపించారు. ఈ యాత్రలో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అంబులెన్స్‌లో వచ్చింది.. ఉపాధ్యాయురాలిగా తిరిగెళ్లింది!