ETV Bharat / state

టీడీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఖమ్మంలో తెదేపా కార్యకర్తల నిరసన.. - టీడీఎల్పీ విలీననాన్ని నిరసిస్తూ ధర్నా

టీడీఎల్పీని తెరాసలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఖమ్మంలోని ఎన్టీఆర్​ కూడలిలో తెదేపా కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్టీఆర్​ విగ్రహం వద్ద.. నోటికి నల్ల బ్యాడ్జి వేసుకుని నిరసన తెలిపారు.

tdp protest, tdlp protest
tdp, khammam
author img

By

Published : Apr 8, 2021, 3:51 PM IST

ఖమ్మంలో తెదేపా కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. టీడీఎల్పీని తెరాసలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్​ కూడలిలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. తెదేపా తరఫున గెలిచి.. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు... ఆ పదవికి రాజీనామా చేసి తెరస తరఫున పోటీచేసి గెలవాలని ఖమ్మం తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్​ చేశారు.

ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా నినదించారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీకి పూర్వవైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: తెరాసకే ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణం... కాంగ్రెస్ అభ్యంతరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.