ఖమ్మం జిల్లా సత్తుపల్లి గారిపేట శివారులోని ఆయిల్‌పామ్ తోటలో ఓ వివాహిత మృతదేహం లభ్యమైంది. శవపరీక్ష నిమిత్తం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతురాలు సత్తుపల్లి మండలం కాకర్లపల్లి వాసిగా గుర్తించారు.
వివాహేతర సంబంధం కారణంగా ఆమె హత్యకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సత్తుపల్లి గ్రామీణ సీఐ కరుణాకర్ పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని అన్నారు.
ఇదీ చూడండి : తెలంగాణలో నా లక్ష్యం అదే... దాని కోసమే పని చేస్తా: బండి సంజయ్