ETV Bharat / state

కరోనాతో సుజాతనగర్​ తొలి ఎమ్మెల్యే సీతారామయ్య మృతి - sujathanagar first mla seetharamaiah died of corona in khammam district

ఖమ్మం జిల్లా సుజాత నగర్​ మాజీ ఎమ్మెల్యే సీతారామయ్య కరోనాతో మృతి చెందారు. నియోజకవర్గం తొలి ఎమ్మెల్యేగా సేవలందించిన ఆయన.. ఉపాధ్యాయుడిగా, న్యాయవాదిగా పనిచేశారు.

sujathanagar first mla died of corona
కరోనాతో సుజాతనగర్​ తొలి ఎమ్మెల్యే మృతి
author img

By

Published : May 8, 2021, 12:50 PM IST

ఖమ్మం జిల్లా సుజాతనగర్​ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా సేవలందించిన సీతారామయ్య కరోనా బారిన పడి మృతి చెందారు. కామేపల్లి మండలం పండితపురానికి చెందిన సీతారామయ్య స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జైలు జీవితం గడిపారు. కొన్నాళ్లపాటు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన.. ఖమ్మం న్యాయస్థానంలో పబ్లిక్​ ప్రాసిక్యూటర్​గా విధులు నిర్వర్తించారు.

1978లో సుజాతనగర్​ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ తరఫున ఎమ్మెల్యేగా సీతారామయ్య పోటీ చేసి గెలుపొందారు. అసెంబ్లీ అంచనాల కమిటీ ఛైర్మన్​గా కూడా పనిచేశారు. పదవీకాలం పూర్తయిన అనంతరం హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించే ఉద్దేశంతో రూ. కోటికి పైగా ఖర్చు చేసి మినరల్ వాటర్ ప్లాంట్లను నెలకొల్పారు.

ఇదీ చదవండి: పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.