ఖమ్మం పట్టణంలో మంత్రి పువ్వాడ సైకిల్ పర్యటనకు శ్రీకారం చుట్టారు.. గతంలో తరచుగా సైకిల్ పర్యటన చేపట్టి నగర ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించేవారు. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ప్రజలను నేరుగా కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయాన్నే మేయర్ పాపాలాల్, కలెక్టర్ కర్ణన్, కమిషనర్ అనురాగ్‌తో కలిసి పర్యటించారు.
సమస్యలను పరిష్కరించండి..
అన్ని ప్రధాన రహదారులు విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డుపై అడ్డుగా ఉన్న విద్యుత్ నియంత్రికలు, వినియోగంలో లేని స్తంభాలను తొలగించాలని విద్యుత్ ఎస్‌ఈకి ఆదేశించారు. అనంతరం 19,20,24,25,33,32 డివిజన్లలో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. డివిజన్లలోని చెత్త, తాగునీరు సమస్యను మంత్రికి వివరించారు. చెత్తను ప్రతిరోజు తొలగించాలని, ప్రతి రోజు డివిజన్లలో పారిశుద్ధ్యంపై వాకబు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తామని పైపులైన్ పనులు జరుగుతున్నాయని వివరించారు. పనుల్లో ఆలస్యం లేకుండా చూడాలని పబ్లిక్ హెల్త్ అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: మన పోలీసుకు ప్రపంచ ఖ్యాతి.. ఆ పదినగరాల్లో హైదరాబాద్!