ETV Bharat / state

నేతన్నల నేస్తం ఈ ఖమ్మం కుర్రాడు.. - hyderabad news

మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, ఆర్థికంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కున్నాడు. ఆ లేమిలోనే కుంగిపోకుండా...ఓ సక్రమమైన మార్గాన్ని ఎంచుకుని, తన ప్రతిభతో రాణిస్తున్నాడు. వ్యాపార వేత్తగా ప్రయాణం ప్రారంభించి, సామాజిక బాధ్యతతో ఓ ప్రయోజనం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తన పని ద్వారా ఓ నలుగురికి ప్రోత్సాహం అందించాలన్న తపనతో కెమెరానే ఆయుధంగా మలుచుకున్నాడు. చేనేత వస్త్రాలను ప్రొత్సహించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ యువకుడే కోరె సాయికిరణ్.

special story on Photographer & Designer Corey Saikiran
నేతన్నల నేస్తం ఈ ఖమ్మం కుర్రాడు..
author img

By

Published : Sep 2, 2020, 12:04 PM IST

నేతన్నల నేస్తం ఈ ఖమ్మం కుర్రాడు..

చేతిలో ఉన్న కెమెరానే ఆయుధంగా...ఫొటోల ద్వారా సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ఈ యువకుడి పేరు కోరె సాయికిరణ్. పాతికేళ్ల ప్రాయంలోనే ఓ బృహత్ కార్యక్రమాన్ని భుజానికెత్తుకుని, నేతన్నలకు అండగా నిలుస్తున్నాడు. అంబాసిడర్లు చేయలేని ప్రచారాన్ని తన ఫొటోల ద్వారా విస్తృతంగా చేస్తున్నాడు. నేటితరం అభిరుచులకు అనుగుణంగా చేనేత వస్త్రాలనే సరికొత్త డిజైనర్ దుస్తులుగా అందుబాటులోకి తెచ్చి, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిస్తున్నాడు.

ఫొటోగ్రఫీ ప్రస్థానం

సాధారణ ఫొటోగ్రాఫర్ అయిన సాయికిరణ్‌కు.. ఓ జంటను చేనేత కళాకారులుగా ఫోటోలు తీయాలన్న ఆలోచన వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సాయికిరణ్.... పాఠశాల స్థాయి నుంచే చిన్నచిన్న పనులు చేసి, ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలబడేవాడు. ఫొటోగ్రఫీపై ఉన్న మక్కువతో....పొదుపు చేసుకున్న చిట్టీ డబ్బులతో ఓ కెమెరా కొన్నాడు. అలా ఎన్నో ఆటంకాలతో మొదలైంది సాయికిరణ్ ఫోటోగ్రఫీ ప్రస్థానం.

అందరికంటే భిన్నంగా ఫొటోలు తీస్తాడని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సాయికిరణ్. ఏటా ముంబయిలో జరిగే ఫొటోగ్రాఫర్ల సదస్సులో....వివిధ దేశాల ఫొటోగ్రాఫర్ల నుంచి మెలకువలు తెలుసుకొని, నిత్యం తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు. ఈకోర్ ఫోటోగ్రఫీ అనే సంస్థను స్థాపించి ఎంట్రప్రెన్యూర్‌ అవతారమెత్తాడు. ఓ వేడుకలో చేనేత వస్త్రాల వైభవానికి ఆకర్షితుడై....చేనేత కార్మికులకు తనవంతుగా సహాయపడాలని నిర్ణయించుకున్నాడు.

ఈకోర్​ ఈవెంట్స్ ​కార్యాచరణ సిద్ధం

సాధారణంగా కాకుండా ఒక కాన్సెప్ట్ తరహాలో ఫొటోలు తీయడంతో సాయికిరణ్ ఈకోర్ స్టూడియోకు అభిమానులు పెరిగారు. సినీ, క్రీడా ప్రముఖుల నుంచి ఆహ్వానాలు పెరిగాయి. చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు.... స్వయంగా కార్మికుల వద్దకు వెళ్లి, వారి నుంచి పెద్దమొత్తంలో వస్త్రాన్ని కొనుగోలు చేశాడు. డిజైనర్ దుస్తులను రూపొందించి, ఈకోర్ డిజైనింగ్ స్టూడియో ద్వారా అందుబాటులోకి తెచ్చాడు.

చిన్న వయసు నుంచే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ వస్తున్న సాయికిరణ్..లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన ఫోటోగ్రాఫర్లకు మంచి అవకాశాన్ని ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈకోర్ ఈవెంట్స్ పేరుతో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిన సాయికిరణ్...దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఫొటోగ్రాఫర్లకు ఉపాధి మార్గాన్ని చూపించే ప్రయత్నాల్లో తలమునకలయ్యాడు.

ఫొటోల్లోనే కాదు... మాటల్లో చేతల్లో చేనేత పట్ల మమకారాన్ని చూపిస్తున్న సాయికిరణ్... వారంలో మూడు రోజులు చేనేత బట్టలనే ధరిస్తానని ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణానికి కట్టుబడి తన ఒంటిమీద ఖచ్చితంగా చేనేత వస్త్రాలు ఉండేలా చూసుకుంటూ స్థానిక ఉత్పత్తుల ప్రాధాన్యతను తోటివారికి వివరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు.

ఇవీచూడండి: మైనర్​పై దాష్టీకం: మత్తు మందు కలిపి అత్యాచారం... భార్య సహకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.