ETV Bharat / state

'భూవివాదం నేపథ్యంలో మహిళా న్యాయవాదిపై దాడి' - ఖమ్మం జిల్లా తాజా వార్తలు

ఓ భూవివాదం నేపథ్యంలో మహిళా న్యాయవాదిపై కొందరు మహిళలు దాడి చేశారు. రోడ్డుపై జుట్టు పట్టుకొని భౌతిక దాడికి దిగారు. ఈఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

భూవివాదం
భూవివాదం
author img

By

Published : Jun 16, 2022, 9:03 PM IST

ఖమ్మం జిల్లాలో ఓ భూవివాదం నేపథ్యంలో మహిళా న్యాయవాదిపై కొంతమంది మహిళలు దాడి చేశారు. రోడ్డుపై జుట్టు పట్టుకొని భౌతిక దాడికి దిగారు. ఈఘటన ఖమ్మం ప్రెస్‌ క్లబ్‌ వద్ద చోటు చేసుకుంది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని మాదిరాజు వెంకటేశ్వరరావు పేరు మీద ఉన్న భూమి వివాదంలో ఉంది.

ఈ భూమిని హైదరాబాద్‌కు చెందిన యాకుబ్‌ పాషా కొనుగోలు చేశారు. ఆయన తన లాయర్‌ పుష్పలతతో కలిసి ఖమ్మం ప్రెస్‌క్లబ్‌ వద్దకు చేరుకున్నారు. ఇంతలో కొంత మంది మహిళలు అక్కడి చేరుకొని ఆ భూమి తమకు సంబంధించిందని గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా న్యాయవాది పుష్పలతపై దాడి చేశారు. ఆమెను దుర్భాషలాడుతూ వెంట పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని న్యాయవాదిని రక్షించారు. ఆ భూమి తమదని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి చెబుతుండగా.. నకిలీ పత్రాలు సృష్టించి తమ భూమి మీదకు వచ్చారంటూ మహిళలు ఆరోపిస్తున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

భూవివాదం నేపథ్యంలో మహిళా న్యాయవాది దాడి

ఇదీ చదవండి: Renuka Choudary On Police: యూనిఫాంను ఎలా గౌరవించాలో మాకు తెలుసు: రేణుకా చౌదరి

దుస్తులు చించేశారని మహిళా ఎంపీ ఆరోపణ.. కేంద్రంపై కాంగ్రెస్​ ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.