ETV Bharat / state

‘ఆడపిల్లను కనండి... రూ.5 వేలు పొందండి' - women's day 2021

‘‘ఆడపిల్లను కనండి... రూ.5 వేలు పొందండి’’.. ఈ పథకం ఏదో కొత్తగా ఉందే.. ఎక్కడా విన్నట్ట్టుగా లేదే అనుకుంటున్నారా!. నిజమే ఈ పథకం ఎక్కడా లేదు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో తప్ప. ఈ గ్రామ సర్పంచి చెరుకూరి ప్రదీప్‌కుమార్‌ మహిళా దినోత్సవం సందర్భంగా తమ గ్రామస్థులకు ఈ అవకాశాన్ని ప్రకటించారు.

shivai-gudem-sarpanch-proposed-a-new-scheme-for-girls-in-khammam-district
ఖమ్మం జిల్లాలో ఆడపిల్లల కోసం ప్రత్యేక పథకం
author img

By

Published : Mar 9, 2021, 7:19 AM IST

ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే చిన్నచూపు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. చాలా మంది తమకు ఆడపిల్లే కావాలనుకుంటున్నారు. కానీ ఎక్కడోచోట ఇంకా భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి మారాలని ఓ యోచన చేశారు ఖమ్మం జిల్లా శివాయిగూడెం సర్పంచ్ ప్రదీప్​కుమార్. మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు.

తాను పదవిలో ఉన్నంతకాలం గ్రామానికి చెందిన మహిళలకు పుట్టే ఆడపిల్లకు సొంత డబ్బుతో పోస్టాఫీసులో రూ.5వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఓ గర్భిణితో కేక్‌ కట్‌ చేయించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తేజావత్‌ శారద, గ్రామదీపిక స్వాతి పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.