ఖమ్మం జిల్లా కొణిజర్ల సమీపంలోని ఓ శీతల గిడ్డంగిలో రూ.4 కోట్ల విలువైన విత్తనాలు మాయమయ్యాయి. ఆహార తనిఖీ సంస్థ వారు 2016లో సీజ్ చేసిన 20 వేల విత్తనాల బస్తాలు బయట తీసుకెళ్లినట్లు సమాచారం. విశ్వసనీయంగా సమాచారం తెలుసుకున్న ఆహార తనిఖీ సంస్థ, విజిలెన్స్, పోలీస్ అధికారులు గిడ్డంగిలో తనిఖీ చేశారు. 2016లో చైనాకు చెందిన ఓ సంస్థ శీతల గిడ్డంగిలో.. రూ. 18కోట్ల విలువ చేసే కురుకురే తయారు చేసే 99వేల ముడిపదార్థాల బస్తాలు నిల్వ చేశారు. తినుబండారాలు తయారు చేసే మిరప విత్తనాలు నాసిరకంగా ఉన్నాయని అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండానే కొన్ని రోజులుగా గిడ్డంగి నుంచి బస్తాలు తరలిస్తున్నారని తెలుకొని అధికారులు దాడులు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీచూడండి: 'ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలోనే నడవాలి'