ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో మొత్తం 10 వేల కేసుల్లో 8 వేల కేసులను పరిష్కరించామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఖమ్మం టీటీడీసీ భవనంలో జన అదాలత్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. పలు కేసులపై సమీక్ష నిర్వహించారు.
కేసులు పరిష్కరించటమే కాకుండా ఇప్పటి వరకు రూ. 55 కోట్ల 60 లక్షలు నష్టపరిహారం బాధితులకు అందజేసిన ఘనత దేశంలోనే మనకు దక్కుతుందని ఎర్రోళ్ల శ్రీనివాస్ వెల్లడించారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్