ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. నియోజకవర్గంలో మొత్తం 120 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు పండించిన అన్నీ పంటలు విక్రయించుకునేందుకు సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలుకు అవసరమైన గన్నీ సంచులు వరంగల్, కరీంనగర్ నుంచి వచ్చేవిధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రపంచదేశాలకు 1 ట్రిలియన్ డాలర్ల రుణం: ఐఎంఎఫ్