పదహారేళ్ల ప్రాయంలో తన చెల్లెలు సరళ ప్రజల కోసం ఉద్యమంలో చేరేందుకు ఎవరికి చెప్పకుండా వెళ్లిందని ఆమె అక్క పద్మ చెప్పారు. విరాట పర్వం సినిమా తన చెల్లెలిపై తీయటం సంతోషంగా ఉందని ఆమెపై ఉన్న ప్రచారాలకు సమాధానం చెప్పినట్లు ఉందన్నారు. ఆరోజు ఖమ్మం మహిళా కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ... రెండు వందల రూపాయలు తీసుకుని ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని తెలిపారు.
సరళ కోసం ఎంతో వెతికామని నెల రోజుల తర్వాత పేపర్‌లో ఆమె మరణ వార్త చూశామని కన్నీటి పర్యంతం అయ్యారు. సాయిపల్లివిని చూస్తే తిరిగి తమ చెల్లెలు పుట్టి వచ్చిందా అన్నట్లు ఉందన్నారు. ఆమెను చూస్తే అచ్చం మా చెల్లిని చూసినట్లే ఉందని గుర్తుకు తెచ్చుకున్నారు. దర్శకుడు వేణుకు ఎంతో రుణ పడి ఉంటామని ఆయన మాచెల్లి గురించి ప్రపంచానికి పరిచయం చేసినందుకు ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువే అన్నారు.
ఇదీ చూడండి: 'విరాటపర్వం.. ఆ విమర్శల్లో ఏమాత్రం నిజం లేదు'