ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో జరిగిన పలు శుభకార్యాల్లో కొత్త నిబంధనలు చాలామంది పాటిస్తున్నారు. వివాహ వేడుకలు, శుభకార్యాలకు హాజరైతే.. పసుపు, కుంకుమ, పన్నీరు ఇచ్చి ఆహ్వానించేవారు. కరోనా వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ముఖద్వారం వద్దనే శానిటైజర్ చల్లి.. థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు ఏర్పాటు చేసి.. అతిథులను శానిటైజ్ చేసి శుభకార్యానికి ఆహ్వానిస్తున్నారు. దగ్గర దగ్గరగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకొనే పరిస్థితి కాస్త మారిపోయి.. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాపించకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించక తప్పదంటున్నారు పలువురు. అయితే ఆహ్వానించే వారు కూడా భౌతిక దూరం పాటిస్తే బాగుండేది.
ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!