ETV Bharat / state

దారులు ధ్వంసం... ప్రయాణం నరకప్రాయం

author img

By

Published : Sep 3, 2020, 1:23 PM IST

ఇటీవల కురిసిన వర్షాలు, భారీ వరదలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రోడ్లు చాలాచోట్ల ధ్వంసమయ్యాయి. రాత్రివేళల్లో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గమ్యం చేరాల్సి వస్తోంది. కుంగిపోయిన కల్వర్టులు, దెబ్బతిన్న చప్టాలతో ప్రయాణికులు ప్రమాదం అంచున ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటనే రోడ్లను బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

roads-damaged-in-joint-khammam-district
దారులు ధ్వంసం... అవస్థలు పడుతున్న వాహనదారులు

ఇటీవలి వర్షాలు, భారీ వరదలకు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖల పరిధిలోని రోడ్లు చాలా మండలాల్లో ధ్వంసమయ్యాయి. కొన్నిచోట్ల కోతకు గురయ్యాయి. పలుచోట్ల పూర్తిగా కొట్టుకుపోయి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తారు చెదిరిపోయి, మట్టి ఎగిరిపోయి వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. రెండు జిల్లాల పంచాయతీ, రహదారులు, భవనాల శాఖ అధికారులు నష్టం అంచనా వేసి మరమ్మతుల ప్రతిపాదనలు పంపారు. సమస్య తీవ్రత దృష్ట్యా వేగంగా నిధుల మంజూరుకు కృషి చేసి రహదారులను బాగుచేయాలని ఉభయ జిల్లాల ప్రజలు కోరుతున్నారు.

మరమ్మతులు తక్షణం చేపడితేనే..

ఉభయ జిల్లాల్లో చాలాచోట్ల ప్రధాన రహదారులు ధ్వంసమై కంకరతేలాయి. ప్రయాణం చేయాలంటే వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. నిత్యం రద్దీగా ఉండే మార్గాలు దెబ్బతినటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రివేళల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గమ్యం చేరాల్సి వస్తోంది. కుంగిపోయిన కల్వర్టులు, దెబ్బతిన్న చప్టాలతో ప్రయాణికులు ప్రమాదం అంచున ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం త్వరితగతిన నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తేనే ప్రజలకు ఉపశమనం కలుగుతుంది.

భారీ వర్షాల ధాటికి కొట్టుకపోయిన రహదారి ఇది. మణుగూరు మండలం చినరాయిగూడెం పరిధిలో ఇన్‌టేక్‌ వెల్‌కు వెళ్లే మార్గంలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. నాలుగు నెలల క్రితం రూ.17 లక్షలతో 950 మీటర్ల రహదారి నిర్మించారు. నిర్మించిన నాలుగు నెలలకే పూర్తిగా కోతకు గురైంది. 350 మీటర్ల మేర పూర్తిగా కొట్టుకుపోయి ధ్వంసమైంది.

  • సమీపంలో రామవరం- గోధుమవాగు వంతెన కుంగిపోయింది. కలెక్టర్‌ ఆదేశాలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.
  • పాల్వంచ- దమ్మపేట రహదారిలో కిలోమీటరు మేర గుంతలమయంగా మారింది.
  • చుంచుపల్లి మండలంలో పెనగడప - మూలుగ్గూడెం మార్గంలో కల్వర్టు ధ్వంసమైంది.
  • దంతెలబోరు-సంగం మార్గం పలుచోట్ల దెబ్బతింది. నాగారం-తోగ్గూడెం రహదారి గుంతలమయంగా మారింది. సోములగూడెం వెళ్లే దారి వరదల ధాటికి ధ్వంసమైంది.

● ముల్కలపల్లి మండలం పొగళ్లపల్లి-తిమ్మంపేట, ఎల్కంవారి గుంపు వెళ్లే రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. చాపరాలపల్లి-కుమ్మరిపాడు మధ్య చప్టా కొట్టుకుపోయింది.

● చంద్రుగొండ మండలం మద్దుకూరు-పోకలగూడెం, చంద్రుగొండ-బెండాలపాడు, తిప్పనపల్లి-తుంగారం రహదారులు వర్షాలకు దారుణంగా దెబ్బతిన్నాయి.

● ఆళ్లపల్లి మండలం మర్కోడు-లొద్దిగూడెం రహదారిలో పెద్దచెరువు అలుగు తాకిడికి బీటీ రోడ్డు కొట్టుకపోయింది. రాయపాడు వద్ద కిన్నెరసాని వంతెనపై రహదారి దెబ్బతింది. కిచ్చెన్నపల్లి వద్ద చప్టా పూర్తిగా కుంగిపోయింది.

● ఖమ్మం-సూర్యాపేట రాష్ట్రీయ రహదారిలో పాలేరు నుంచి దమ్మాయిగూడెం వరకు 17కి.మీ. మార్గం దాదాపు ఎనిమిదిచోట్ల ధ్వంసమైంది. గుంతలు ఏర్పడి రాత్రి వేళల్లో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

● పినపాక మండలంలో మద్దులగూడెం-సింగిరెడ్డిపల్లి ప్రధాన రహదారి దెబ్బతింది. ఏడూళ్లబయ్యారం నుంచి వాగబోయిన గుంపు వెళ్లే మార్గం చాలామేర కొట్టుకుపోయింది.

● ఖమ్మం- సత్తుపల్లి మార్గంలో కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాల్లో పలుచోట్ల రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముత్తగూడెం- కల్లూరు, టేకులపల్లి-రామచంద్రరావు బంజర, కిష్టారం- సత్తుపల్లి మధ్య సమస్య తీవ్రంగా ఉంది.

● కరకగూడెం మండలంలోని కొత్తగూడెం-కోరంవారి గుంపు రహదారి పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. కుర్నవల్లి వద్ద రహదారి కోతకు గురైంది.

● గుండాల మండలంలో మల్లన్నవాగు, పోతిరెడ్డి గూడెం దగ్గర రహదారులు తెగిపోయాయి. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా కొద్ది వరద వచ్చినా పరిస్థితి పునరావృతం.

"ఇటీవలి వర్షాలకు ఖమ్మం జిల్లాలో పంచాయతీ రహదారులకు ఎక్కువ నష్టం లేదు. స్థానికంగా అందుబాటులో ఉన్న నిధులతో మరమ్మతులు చేసుకోవాలి. భద్రాద్రి జిల్లాలో రహదారులు దెబ్బతిన్నాయి. మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాం.’’ - సీతారాములు, ఎస్‌ఈ, పీఆర్‌ (ఖమ్మం భద్రాద్రి జిల్లాలు)

‘‘జిల్లాలో ఇటీవలి వర్షాలు, వరదలకు పలు మండలాల్లో రహదారులు ధ్వంసమయ్యాయి. తాత్కాలిక, శాశ్వత మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. శాశ్వత రహదారులు, వంతెనల నిర్మాణం కోసం రూ.100 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశాం’’. - బీమ్లా, ర.భ. ఈఈ, భదాద్రి జిల్లా

ఇవీ చూడండి: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.