ఖమ్మం బైపాస్ రహదారి నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. నగరానికి వచ్చి వెళ్లేవారంతా ఆ మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. ఐతే ఆ రోడ్డుపై 2 కిలోమీటర్ల ప్రయాణం ప్రయాణికుల పాలిట ప్రాణ సంకటంగా మారింది. రాపర్తినగర్ నుంచి కరుణగిరి వరకు రహదారి.. వాహనదారులను భయ కంపితులను చేస్తోంది. దానవాయిగూడెం, ఎఫ్‌సీఐ గోడౌన్స్, కరుణగిరి, రాజీవ్‌గృహకల్ప, శ్రీరాంనగర్ కాలనీలకు వెళ్లేవారు నిత్యం ప్రమాదాల బారినపడుతున్నారు. మెయిన్‌రోడ్డు నుంచి తమ ప్రాంతం వైపు వాహనాన్ని మళ్లిస్తున్న సమయంలో వేగంగా వస్తున్న భారీ వాహనాలు ఢీకొంటున్నాయి. ఒక్క ఏడాదిలోనే 15 ప్రమాదాలు జరగ్గా 11 మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో వాహనదారులు, ప్రయాణికులు గాయాల పాలయ్యారు.
రహదారిపై డివైడర్, వేగ నియంత్రణ బోర్డులు, సిగ్నళ్లు లేకపోవడం ప్రయాణికుల పాలిటశాపంగా మారుతోంది. వాహనాల నియంత్రణ కోసం ట్రాఫిక్ పోలీసులు ఉండకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేగమే చాలాసార్లు ప్రమాదానికి కారణం అవుతోందని స్థానికులు అంటున్నారు. అధికారులు మాత్రం ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. రామోజీ రమేశ్, ట్రాఫిక్ ఏసీపీ, ఖమ్మం
ప్రధాన రహదారి వెంట బైపాస్ రోడ్డు నిర్మిస్తే.. భారీ వాహనాల నుంచి చిన్న వాహనాలకు ప్రమాదాలు తప్పుతాయని.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: