ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని.. లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడు బోదలబండకు చెందిన పుల్లయ్యగా పోలీసులు గుర్తించారు. నేలకొండపల్లి నుంచి బోదలబండ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
నేలకొండపల్లిలో కారు, లారీ ఢీకొని ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొంది. సమాచారం అందుకున్న పోలీసులు రెండు వాహనాలను స్టేషన్కు తరలించారు.