ఇవీ చూడండి:హైదరాబాద్‌ను రెండవ రాజధాని చెయ్యాలి: రేవంత్
దేశం కోసం చేయి - సైకిల్ కలిశాయి: రేణుక - congress
కాంగ్రెస్-తెదేపా కలిసుండటానికి ఆనాడు నందమూరి తారకరామారావు వేసిన పునాదులే కారణమని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. దేశం కోసం హస్తం-తెదేపా కలిశాయని తెలిపారు.
రేణుకా చౌదరి
ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు తీసుకువస్తానంటున్నారు.. ఖమ్మంలో స్థాపించి ఐదు సంవత్సరాలు అవుతోందని తెలీదేమోఅన్నారు కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి. ఖమ్మంలో నిర్వహించిన తెదేపాపార్లమెంటరీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేశానని తెలిపారు. రేణుకా చౌదరిని భారీ మెజార్టీతో గెలిపించాలని తెదేపా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెదేపా-కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు.
ఇవీ చూడండి:హైదరాబాద్‌ను రెండవ రాజధాని చెయ్యాలి: రేవంత్
sample description