ETV Bharat / state

పార్టీ విధివిధానాలపై ఖమ్మం సభలో షర్మిల ప్రకటన! - telangana varthalu

ఖమ్మం నుంచే షర్మిల శంఖారావం పూరిస్తారని ఆమె ముఖ్య అనుచరుడు రాఘవరెడ్డి వెల్లడించారు. ఏప్రిల్ 9న నిర్వహించే బహిరంగ సభలో కొత్త పార్టీ విధివిధానాలు అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ విధివిధానాలపై ఖమ్మం సభలో షర్మిల ప్రకటన!

author img

By

Published : Mar 15, 2021, 4:19 AM IST

ఏప్రిల్ 9న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో కొత్త పార్టీ విధివిధానాలు వైఎస్ షర్మిల ప్రకటించే అవకాశం ఉందని ఆమె ముఖ్య అనుచరుడు కొండా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం నుంచే షర్మిల శంఖారావం పూరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో వైఎస్ అభిమానులతో ఖమ్మంలో రాఘవరెడ్డి సమావేశమయ్యారు. షర్మిల సభను విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులపై నేతలను అడిగి తెలుసుకున్నారు.

ఉమ్మడి జిల్లాలో గతంలో కంటే ఎక్కువ ఆదరణ ఉంటుందనే అంచనాలతో షర్మిల ఇక్కడ సభకు సిద్ధమయ్యారని రాఘవరెడ్డి తెలిపారు. దివంగత వైఎస్​ విగ్రహాన్ని ధ్వంసం చేసిన శివాయిగూడెం ప్రాంతాన్ని జిల్లా నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.

పార్టీ విధివిధానాలపై ఖమ్మం సభలో షర్మిల ప్రకటన!

ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్​పై పుకార్లు నమ్మవద్దు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.