పాఠశాలలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ.. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. టీఆర్ఎస్ఎంఏ, టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో మండల కేంద్రం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు.
కరోనా కాలంలో నష్టపోయిన తమకు నెలకు 7000 చొప్పున ప్రభుత్వం భృతి కల్పించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. కొవిడ్ వల్ల ఉపాధి కోల్పోయి.. తమ కుటుంబాలు వీధిన పడ్డాయని వాపోయారు. పాఠశాలను తెరిచి.. మళ్లీ బంద్ చేయడం వల్ల టీచర్స్ దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని.. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉపాధి కల్పించాలని కోరారు.
ఇదీ చూడండి: మన సంస్కృతి, సంప్రదాయాన్ని విస్మరిస్తున్నాం: ఉపరాష్ట్రపతి