Ponguleti Joins Congress : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏ పార్టీలో చేరాలనే విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఖమ్మంలో ఇవాళ ముఖ్య నేతలతో పొంగులేటి భేటీ కానున్నారు. అల్పాహార విందు భేటీకి హాజరుకావాలని మండలాల వారీగా ముఖ్య నాయకులకు సమాచారం చేరవేశారు. ఈ సందర్భంగా ఏ పార్టీలో చేరాలన్న నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో ముఖ్యనాయకులు, అనుచరుల్లో అత్యధిక మంది కాంగ్రెస్ పార్టీలో చేరాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆయన రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
Ponguleti Organized Breakfast Dinner At Khammam : రకరకాల ప్రచారాలు జరిగినప్పటికీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి కాంగ్రెస్ వైపే పొంగులేటి మొగ్గు చూపుతున్నారని గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయనతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కలిసి వచ్చే నేతలందరూ ఒకేసారి కాంగ్రెస్ గూటికి చేరతారని సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్థానిక పరిస్థితులు, రాజకీయ వాతావరణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇటీవలే పొంగులేటిని కలిసి చర్చించినట్లు తెలుస్తోంది.
- Etela Rajender Meet Ponguleti and Jupally : బీజేపీలో చేరాలని పొంగులేటి, జూపల్లికి ఈటల ఆహ్వానం
- జూపల్లి, పొంగులేటి.. 'చేతి'కి చిక్కుతారా? కమలం గూటికి చేరుతారా?
Ponguleti to Join Congress : కాంగ్రెస్ అధిష్ఠానం కూడా పొంగులేటి తమ పార్టీలో చేర్చుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. చేర్చుకోవడమే కాకుండా వారికి పార్టీలో తగిన ప్రాధాన్యమివ్వడానికి కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. సునీల్ కనుగోలుతో జరిగిన చర్చల్లో.. నియోజకవర్గాల అంశాలు, అభ్యర్థులు గురించి చర్చకు వచ్చినట్లు టాక్. అయితే గెలుపు గుర్రాలకు మాత్రమే పోటీలో నిలవడానికి అవకాశం ఇచ్చే అంశం గురించి సమాలోచనలు జరుగుతున్నాట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉండడంతో.. ఆయన భారత్‌కు వచ్చిన తర్వాత నేరుగా భేటీ అయ్యే ఆలోచనలో ఉంది టీ కాంగ్రెస్. రాహుల్ గాంధీతో అన్ని విషయాలు గురించి చర్చించిన తర్వాతే చేరిక తేదీని ఖరారు చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Will Ponguleti joins BJP : మరోవైపు బీజేపీ కూడా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. ఆయన చేరేందుకు ససేమిరా అన్నప్పటికీ కమలదళం మాత్రం తమ ప్రయత్నాలు ఆపడం లేదు. కొన్ని రోజుల క్రితం ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్.. చేరికల కమిటీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఈటల రాజేందర్‌తో చర్చించినట్లు సమాచారం.
ఇవీ చదవండి: