అటవీ ప్రాంతంలో వైద్యానికి దూరంగా ఉన్న గిరిజనులను గుర్తించి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు... ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. గుత్తి కోయల కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటుందని అన్నారు. ఏన్కూర్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
దాదాపు 350 కుటుంబాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గిరిజన కుటుంబాలకు నిరంతరం సాయం అందించాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శిబిరాన్ని ఏర్పాటు చేసిన స్థానిక పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు.
![Police Department conduct Mega medical camp for Tribals in khammam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10726146_82_10726146_1613975297942.png)
ఇదీ చదవండి: మాతృభాషలో బోధనతోనే నేర్పరితనం