లాక్‌డౌన్ నేపథ్యంలో.. ఇబ్బందులు పడుతున్న పేదలకు ఎమ్మెల్యే రాములునాయక్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా వైరాలోని క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా వైరస్ అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.
కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే విధంగా.. సీఎం అధికార యంత్రాంగానికి మార్గదర్శకాలు అందించారని ఎమ్మెల్యే తెలిపారు. లాక్‌డౌన్ ముగిసే వరకు నిబంధనలు పాటించాలని, మాస్కులు కచ్చితంగా ధరించాలని సూచించారు.
ఇదీ చూడండి: దూరంగా బెంచీలు... సగంమందే విద్యార్థులు