ఖమ్మంలో తొలి కరోనా కేసు నమోదు కావడం వల్ల అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 వరకు మాత్రమే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతిస్తున్నారు. మెడికల్ దుకాణం తప్ప ఏ ఇతర దుకాణాలు తెరిచి ఉండకూడని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తేల్చి చెప్పారు. అందరూ సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లఘిస్తే చర్యలు తప్పని హెచ్చరించారు.
కరోనా నివారణ చర్యల్లో ఖమ్మం జిల్లా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నా... రాష్ట్రమంతా సాయంత్రం 6 గంటల వరకు నిత్యావసరాల దుకాణాలు తెరిచి ఉంటుంటే.. ఖమ్మంలో త్వరగా దుకాణాలు మూసివేయటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ పొడిగింపు దిశగా కేంద్రం ఆలోచన!