ETV Bharat / state

ఉద్యోగానికి ముందు... తర్వాత... - LOVER SUCIDE

నాలుగేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. నువ్వు లేకపోతే బతకలేను పెళ్లిచేసుకుందామంటూ ఆమెకు ఆశ కల్పించి చివరకు నట్టేట ముంచాడో కానిస్టేబుల్. తీవ్ర మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఉద్యోగానికి ముందు... తర్వాత...
author img

By

Published : May 30, 2019, 4:54 AM IST

Updated : May 30, 2019, 7:51 AM IST

ఖమ్మం జిల్లా మధిర మండలం నాగవరప్పాడు గ్రామానికి చెందిన రమాదేవి అదే గ్రామానికి చెందిన గోపికృష్ణ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. రమాదేవి టీటీసీ పూర్తిచేసి డిగ్రీ చదువుతోంది. అయితే గోపీకృష్ణకు సంవత్సరం క్రితం ఏఆర్ కానిస్టేబుల్​గా ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి గోపీకృష్ణ కొత్తగూడెంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం వచ్చింది కాబట్టి ఎక్కువ కట్నం ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చనే దురాశతో ప్లేటు ఫిరాయించాడు గోపీకృష్ణ. వేరే పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు.

విషయం తెలుసుకున్న యువతి గోపీకృష్ణను నిలదీయగా... నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుని చనిపోతానంటూ యువతిని బెదిరించాడు. గ్రామ పెద్దల సమక్షంలో కూడా యువతిని నిరాకరించాడు. ఎంత చెప్పిన ప్రియుడు వినడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరుగుతున్న సమయంలోనే గోపీకృష్ణ వేరే యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. విషయం తెలిసిన రమాదేవి తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఉద్యోగానికి ముందు... తర్వాత...

ఇవీ చూడండి: కొండగట్టులో ముగిసిన హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

Intro:tg-kmm-09_29_yuvathi aatmahathyayatnam_av_-c1_kit 889 నాలుగేళ్లుగా ఓ యువతిని ప్రేమించానని నమ్మించాడు ఓ కానిస్టేబుల్ జీవితంపై ఆశ కల్పించి చివరగా యువతిని నట్టేట ముంచాడు మోసపోయానని గ్రహించి ఆ యువతి మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది

Body:ఖమ్మం జిల్లా మధిర మండలం నాగవరప్పాడు గ్రామానికి చెందిన రమాదేవి అదే గ్రామానికి చెందిన గోపికృష్ణ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు రమాదేవి టిటిసి పూర్తిచేసి డిగ్రీ చదువుతోంది అయితే గోపికృష్ణ కు సంవత్సరం క్రితం ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగం రావడంతో కొత్తగూడెంలో విధులు నిర్వహిస్తున్నాడు గోపికృష్ణ ఉద్యోగం రావడంతో ప్లేటు ఫిరాయించి బయట వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ విషయం తెలుసుకున్న యువతి గోపి కృష్ణ ను గట్టిగా నిలదీయడంతో నిన్ను పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుని చనిపోతానని యువతని బెదిరించాడు గ్రామ పెద్దల సమక్షంలో సైతం యువతిని నిరాకరించడంతో వారం రోజుల క్రితం గ్రామీణ పోలీసు స్టేషన్ లో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది విచారణ జరుగుతున్న సమయంలోనే కానిస్టేబుల్ గోపికృష్ణ గ్రామంలో వేరే యువతి తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్న విషయం బయటపడింది దీంతో రమాదేవి మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది మెదడు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నాడు

Conclusion:కేపీ
Last Updated : May 30, 2019, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.