చింతకాని- కొణిజర్ల రహదారిపై మృతదేహంతో గ్రామస్థులు రాస్తారోకో చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం రెడ్డిగూడెంలో విద్యుదాఘాతంతో ఆది వర్దన్‌రెడ్డి మృతిచెందాడు. గ్రామంలోని ఓ స్తంభం వద్ద తెగిపడిన విద్యుత్ తీగలను పక్కకు నెట్టే క్రమంలో ఈ ఘటన జరిగింది. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం వల్లనే మృతిచెందాడని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : మోదీజీ.. దక్షిణాది తారలనూ గుర్తించండి: ఉపాసన