'మిమ్మల్నందర్నీ వీడలేక వీడ్కోలు పలుకుతున్నా' - old bus stand in khammam district
రోజు ఎంతో మంది నా చెంతకు వస్తారు. తమకు ఇష్టమైన వారిని వీడలేక వీడిపోతున్న వారిని చూశాను. తమ కోసం సుదూర తీరాల నుంచి వస్తున్న వారి కోసం గంటల తరబడి ఎదురుచూసిన వారినీ చూశాను. ఎన్నో ప్రేమ కథలు, మరెన్నో కుటుంబ గాథలు, చిన్ని చిన్ని దొంగతనాలు, చిలిపి తగాదాలు.. బతుకుదెరువు కోసం నన్ను ఆసరా చేసుకున్న వాళ్లని.. తమ భవిష్యత్ కోసం నా నుంచే ప్రయాణం మొదలు పెట్టే వాళ్లని.. ఎందర్నో చూశాను. ఎన్నో వీడ్కోలు చూసిన నాకు.. ఈ రోజు వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది.. నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథల్ని చూసిన నా కథ నేడు కంచికి చేరింది. మళ్లీ ఎప్పటికీ మిమ్మల్ని కలవలేనన్న బాధతో.. మరో కొత్త ప్రపంచానికి మీరు స్వాగతం చెబుతున్నారన్న ఆనందంతో.. నా నాలుగు దశాబ్ధాల ప్రయాణం గురించి మీకోసం..