ETV Bharat / state

గురుకులాలు, వసతి గృహాల్లో నాసిరకం భోజనం, విద్యార్థులకు అందని ద్రాక్షగా పౌష్టికాహారం - telangana latest news

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ గురుకులాలు, వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందని ద్రాక్షగానే మిగులుతోంది. పౌష్టికాహారం అందించేందుకు నెలవారీగా ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నా ఆ ఫలాలు విద్యార్థులకు దక్కడం లేదు. నాసిరకం భోజనం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నా అధికారుల్లో చలనం కనిపించడం లేదు.

గురుకులాలు, వసతి గృహాల్లో నాసిరకం భోజనం, విద్యార్థులకు అందని ద్రాక్షగా పౌష్టికాహారం

author img

By

Published : Aug 30, 2022, 8:15 AM IST

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు.. నిరుపేద బాల బాలికలు చదువుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 300 గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 25 వేల మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50 వేల మంది విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటూ చదవుకుంటున్నారు. కొన్నిచోట్ల సొంత భవనాల్లో, మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లో వసతి గృహాలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రత్యేకంగా మెనూ తయారు చేసి.. కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ ఎక్కడా మెనూ అమలవ్వడం లేదు. ఎక్కడ చూసినా ఉడికీ ఉడకని అన్నమే విద్యార్థులు తినాల్సి వస్తోంది. మురిగినవి, కుళ్లిపోయిన కూరగాయలతో కూరలు వండుతున్నారు. ఉదయం టీ, టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు ఎక్కడా మెనూ ఛార్ట్ అమలవుతున్న దాఖలాలే లేవు.

అమలు కాని నిబంధన..: పలు వసతి గృహాలు, గురుకులాల్లో తమకు నాణ్యమైన ఆహారం అందించాలంటూ విద్యార్థుల ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తిరుమలాయపాలెం మండలంలోని మాదిరిపురం అడ్డరోడ్డులోని గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో నాణ్యమైన భోజనం పెట్టాలంటూ 2 కిలోమీటర్ల మేర ప్రదర్శన నిర్వహించారు. సింగరేణి మండలంలోని గిరిజన బాలుర గురుకులంలో, రఘునాథపాలెంలోని వైరా బీసీ గురుకులంలో మెనూ అమలు చేయాలని నిరసన తెలిపారు. టేకులపల్లి ఎస్సీ గురుకులంలో విద్యార్థులు పలుమార్లు భోజనం మానేసి ఆందోళన చేశారు.

ఇల్లందు పట్టణంలోని మైనార్టీ బాలుర గురుకులంలో మెనూ పాటించడం లేదని.. అన్నంలో పురుగులు వస్తున్నాని విద్యార్థులు రోడ్డెక్కారు. జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురంలోని పోస్టు మెట్రిక్ వసతి గృహంలోనూ మెనూ అమలు కావడం లేదని ఐటీడీఏ అధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వారానికి 4 సార్లు కోడి గుడ్లు, 2 సార్లు అరటి పండ్లు, ఆదివారం కోడి కూర పెట్టాలన్న నిబంధన ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదని విద్యార్థులు వాపోయారు.

అధికారులు స్పందించాలి..: చాలాచోట్ల వార్డెన్లు స్థానికంగా ఉండటం లేదు. అందువల్ల పర్యవేక్షణ లేకుండా పోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకుని వసతిగృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇవీ చూడండి..

ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం ఆదేశం

ఇంట్లో బంగారు నిధి, గుట్టుగా పంచుకున్న కూలీలు, తప్పతాగి నోరుజారేసరికి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.