బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సంక్షేమ ఫలాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకే దక్కుతుందని తెదేపా నాయకులు కొనియాడారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు.
ప్రధాన కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీపీ అరెం వరలక్ష్మీ, మాజీ జడ్పీటీసీ కోపెల శ్యామలతోపాటు జిల్లా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేద ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.
ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్.. దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'