ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మలకుంటకు చెందిన ఏటుకూరి నరసింహారావు రైతు సమన్వయ సమితి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. గత రాత్రి మృతుడు తాళ్ల పెంట నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామం వెళ్తుండగా రహదారిపై కాపు కాసిన గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. తల పై దాడి చేయడం వల్ల అక్కకక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని కల్లూరు ఏసీపీ వెంకటేశ్, గ్రామీణ సీఐ రవికుమార్, వీఎం బంజార్ ఎస్సై నాగరాజు పరిశీలించారు. పంచాయతీ ఎన్నికల్లో ఇరువర్గాల మధ్య జరిగిన వివాదంతోనే ఈ హత్య జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైన ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ