ఖమ్మం జిల్లా కల్లూరు అత్యాచార ఘటనలో దోషులను అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. కల్లూరులో చేపట్టిన మహాధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బాధితుల ఫిర్యాదు పక్కన పెట్టి పోలీసులు కేసు నీరుగార్చే సెక్షన్లు నమోదు చేశారని ఆరోపించారు.
కరోనా సమయంలో పోలీసుల సేవలు ప్రశంసనీయమని... కానీ తప్పు జరిగిన చోట ఎవరిని ఉపేక్షించేది లేదని మంద కృష్ణ మాదిగ అన్నారు. బలహీనులపై దాడులు చేసే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కల్లూరు ఘటనలో నిందితులకు కొమ్ము కాయడం వల్లే... ఉన్నతాధికారులు ఎవరిని అరెస్టు చేయడం లేదని ఆరోపించారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.