ETV Bharat / state

క‌ష్టాల్లో ఉన్న గ్రానైట్ ఇండ‌స్ట్రీని ఆదుకోండి: ఎంపీ నామ - తెలంగాణ తాజా వార్తలు

ద‌క్షిణాది రాష్ట్రాల్లో గ్రానైట్ ఇండ‌స్ట్రీ క‌ష్టాల్లో ఉందని, వాళ్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయాల‌ని ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. పర్యావరణ అనుమ‌తులు త్వ‌ర‌గా వ‌చ్చే విధంగా చూడాల‌ని పార్లమెంట్​లో ప్రస్తావించారు.

mp nama said Support the troubled granite industry in telangana
'క‌ష్టాల్లో ఉన్న గ్రానైట్ ఇండ‌స్ట్రీని ఆదుకోవాలి'
author img

By

Published : Mar 19, 2021, 4:01 PM IST

క‌ష్టాల్లో ఉన్న గ్రానైట్ ఇండ‌స్ట్రీని ఆదుకోండి: ఎంపీ నామ

పార్లమెంట్ సమావేశాల్లో గ్రానైట్ పరిశ్రమల సమస్యలపై తెరాస లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రస్తావించారు. అందులో భాగంగా ఈసీ క్లీయరెన్స్, పర్యావరణ అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న గ్రానైట్ పరిశ్రమలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ నామ కేంద్రానికి తెలిపారు.

జిల్లా ఖ‌నిజాభివృద్ధి నిధుల‌ను వాడేందుకు రాష్ట్రాల‌కు అధికారాలు ఇవ్వాల‌న్నారు. నిధుల ఆధిప‌త్యం మొత్తం కేంద్రం చేతుల్లో ఉంద‌ని, స్థానిక రాష్ట్రాల‌కు కూడా అధికారాలు ఇవ్వాల‌ని ఆయన అన్నారు. తెలంగాణ‌లో ఐర‌న్‌, మాంగ‌నీస్‌, లైమ్ స్టోన్ తవ్వ‌కాల కోసం అనుమ‌తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ ప‌నులు చేప‌ట్టేందుకు అనుమతులు జారీ చేయాలని ఎంపీ కోరారు.

ఇదీ చూడండి : విషాదం: గోదావరిలో పడి ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.