తన నియోజకవర్గానికి సంబంధించిన ఓ అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే ద్వారా అసెంబ్లీలో ప్రస్తావించేలా చేశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. గ్రేటర్ హైదరాబాద్ సహా పట్టణప్రాంతాలకు సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో స్వల్పకాలిక కాలిక చర్చ జరిగింది.
తన నియోజకవర్గం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని కొన్ని అంశాలను సభావేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోవాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ భావించారు. మంత్రిగా ఉన్న ఆయన చర్చలో పాల్గొనే అవకాశం లేదు. దీంతో జిల్లాకు చెందిన శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ద్వారా ఆ అంశాన్ని సభలో ప్రస్తావనకు వచ్చేలా చేశారు.
సండ్ర వెంకటవీరయ్య సైతం మంత్రి తరఫున ఈ అంశాన్ని లేవనెత్తినట్లు చెప్పారు. సహచర మంత్రికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించిన వెంకటవీరయ్యకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: కొత్త రెవెన్యూ చట్టంతో పేదలు, రైతులకు మేలు: పువ్వాడ