MLA Sandra in women's day celebrations : మహిళల సంక్షేమం కోసం తెరాస పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలన్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 6,7,8న మహిళా బంధు - కేసీఆర్ పేరిట సంబురాలు జరపాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
అందులో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో... తెరాస ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రంగవల్లులు వేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సహా మహిళలకు తెరాస సర్కారు ఏం చేసిందో అందులో సవివరంగా పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందని చెబుతుందని తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇచ్చే చెక్కుతోపాటు ఎమ్మెల్యేగా తాను ఒక చీరను బహుమతిగా ఇస్తున్నట్లు సండ్ర చెప్పారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం.. పేదింటిలో దీపం వెలిగిస్తోంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు యావత్ తెలంగాణ మహిళా లోకానికి డెడికేట్ చేసే విధంగా నిర్వహిస్తాం. కల్యాణలక్ష్మి చెక్కుతో పాటుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను ఒక చీరను బహుమతిగా ఇస్తాను. ఇంటింటికి వెళ్లి... పెళ్లి కూతురికి చీరను ఇస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
-సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే
ఇదీ చదవండి: MahilaBandhu: మూడు రోజుల పాటు 'మహిళా బంధు' కేసీఆర్