తెరాస ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ప్రజలంతా ఇది గమనించాలని కోరారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్లోని ఎంప్లాయిస్ కాలనీలో సీసీరహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంతులి, సీడీఎస్ ఛైర్మన్ ముక్కెర భూపాల్ రెడ్డి, జడ్పీటీసీ మోహన్ రావు, ఏఎంసీ ఛైర్మన్ లక్ష్మణరావు, ఎంపీటీసీ ఝాన్సీ, ఉపసర్పంచ్ విజయ కుమారి పాల్గొన్నారు.